Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 10:00:24
facebook Twitter Googleplus
Photo

కెరీర్లో అతడికి ఎదురైన పెద్ద డిజాస్టర్లలో 1 నేనొక్కడినే కూడా ఒకటి. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఐతే ఈ సినిమా గురించి మహేష్ ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడింది మాత్రం లేదు. దీని స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళంగా ఉంటుందని.. దాన్ని ఇంకొంచెం సులభతరంగా చెప్పి ఉండాల్సిందని అన్నాడు మహేష్. సుకుమార్ గురించి ఆ తర్వాత కూడా గొప్పగానే మాట్లాడాడు మహేష్. దీని తర్వాత చేసిన ఆగడు ను ఒక మిస్టేక్ గా చెప్పిన మహేష్ 1 నేనొక్కడినే’ను మాత్రం తన కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగానే చెబుతాడు. దీన్ని బట్టే సుకుమార్ మీద అతడికి ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

భవిష్యత్తులో సుక్కుతో మళ్లీ పని చేస్తానని గతంలోనే ప్రకటించిన మహేష్.. ఇప్పుడు ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భరత్ అను నేను చేస్తున్న మహేష్.. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆపై త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశముంది. దాని తర్వాత 14 రీల్స్ వాళ్లకు ఓ కమిట్మెంట్ ఇచ్చాడు మహేష్. ఐతే ఈ సినిమాకు దర్శకుడెవరనే విషయంలో మహేష్ కు.. నిర్మాతలకు ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. మహేష్ ఏమో సుక్కుతో పని చేయాలని అంటుండగా.. నిర్మాతలు మాత్రం బోయపాటి శ్రీనును ప్రిఫర్ చేస్తున్నారట. మహేష్-సుక్కు కాంబినేషన్లో 1 నేనొక్కడినే తీసింది 14 రీల్స్ వాళ్లే. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. తమ సంస్థకు ‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటితోనే మహేష్ సినిమా చేయించాలని వాళ్లు భావిస్తున్నారట.

,  ,  ,  ,  ,