Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2016 11:18:37
facebook Twitter Googleplus
Photo

గత కొన్ని రోజులుగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం అభిమానులు గమనించే ఉంటారు. చుట్టూ పిల్లలు.. వారి మధ్య అందంగా నవ్వుతున్న మహేష్.. ఈ ఫొటో అందరికీ భలే నచ్చేసింది. మహేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్లో సైతం ఈ ఫొటో దర్శనమిచ్చింది. ఇప్పుడీ ఫొటోకు సంబంధించిన ఆసక్తికర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా షూటింగులో భాగంగా పిల్లల మధ్య తీసిన ఓ సన్నివేశం సందర్భంగా తీసిన ఫొటో అది. ఆ సన్నివేశంలో 2500 మంది పిల్లలు పాల్గొన్నారట.

ఆ 2500 మందికి మహేష్ బాబు స్పెషల్ గిఫ్ట్స్ పంపించడం విశేషం. దీపావళి సందర్భంగా ఒక బాక్సులో చాకెట్లు.. మ్యాంగో డ్రింక్స్ పెట్టి వాటిని ఆ పిల్లలకు పంపించారు. దీంతో పాటు బాక్సు లోపలే మహేష్ బాబు నోట్ కూడా ప్రింట్ చేశారు. ??నేను పనిచేసే చోటికి వచ్చి ఎంతో ఆనందాన్ని కలిగించిన నా చిన్నారి స్నేహితులకు థ్యాంక్స్.. ఎప్పుడూ మెరిసిపోతూ ఉండండి.. లవ్ - మహేష్ బాబు?? అని ఆ నోట్లో పేర్కొన్నాడు ప్రిన్స్. మహేష్ బాబును కలవడం.. తనతో షూటింగ్ చేయడమే ఆనందం అంటే.. మహేష్ నుంచి స్వయంగా ఇలాంటి గిఫ్ట్ కూడా అందుకోవడం అంటే ఇక ఆ పిల్లల ఆనందానికి అవధులుండవు. వాళ్లకు ఎప్పటికీ మరిచిపోలేని కానుకే ఇచ్చాడు ప్రిన్స్.

,  ,  ,  ,  ,  ,