Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 12:42:50
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ సెట్స్ మీదికి వెళ్లి దాదాపు ఏడాదవుతోంది. వేసవికే వస్తుందనుకున్న ఈ చిత్రం దసరాకు వాయిదా పడింది. ఇంత సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి రావడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. పోనీ వాళ్లను ఎంటర్టైన్ చేస్తూ.. ఎంగేజ్ చేస్తూ సినిమాకు సంబంధించిన విశేషాల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారా అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఆ తర్వాత ఓ బుల్లి టీజర్ వదిలారు. అది బాగున్నా సరే.. సినిమాకు సంబంధించిన విజువల్స్ ఏమీ లేకపోవడం నిరాశ పరిచింది. తమకు కిక్కిచ్చే టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోరిక తీర్చే విశేషం ఒకటి అతి త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.

సినిమాలోని షాట్లతో ఓ స్పెషల్ టీజర్ ను స్పైడర్ బృందం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నెల 20న మహేష్ బాబు తనయురాలు సితార పుట్టిన రోజు కానుకగా ఈ టీజర్ ను రిలీజ్ చేస్తారని అంటున్నారు. అదే నిజమైతే మహేష్ అభిమానుల ఆనందానికి అవధులుండవు. దీంతో పాటు వచ్చే నెల 9న మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తారట. అక్కడి నుంచి సినిమా విడుదలకు ఇంకా నెలన్నర సమయం ఉంటుంది. ఆగస్టు నెలాఖరుకు స్పైడర్ ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయట. సెప్టెంబరు మొత్తం ప్రమోషన్లకే కేటాయించనున్నారు.

,  ,  ,  ,  ,  ,