Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 12:07:47
facebook Twitter Googleplus
Photo

అప్పట్లో ఒకడుండేవాడు.. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానున్న చిత్రం ఇది. నారా రోహిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో యాక్టర్ శ్రీ విష్ణు లీడ్ రోల్ చేస్తుండడం విశేషం. ఇప్పటివరకూ 21 సినిమాలు చేసిన ఈ కుర్రాడికి ఇది అతి పెద్ద ఛాన్స్. తొలిసారిగా ఒక సినిమాని నడిపించే పాత్ర చేయబోతున్నాడు.

పీరియాడిక్ చిత్రంగా వస్తున్న సినిమాలో నారా రోహిత్- శ్రీ విష్ణు ఇద్దరివీ ప్రధాన పాత్రలే. ఎవరు విలన్.. ఎవరు హీరో అనే విషయాన్ని మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వడం. అప్పట్లో ఒకడుండేవాడు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శ్రీ విష్ణుని ఇదే సంగతి అడిగితే.. అతని పాత్రకు నేను విలన్.. నా పాత్రకు అతను విలన్ అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఇక వ్యక్తిగతంగా అయితే క్రికెట్ అంటే ఇష్టం అని చెబుతున్న శ్రీ విష్ణు.. సినిమాల్లోకి రాకముందే.. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసేసుకున్నాడు. అది కూడా లవ్ మ్యారేజ్ కావడం విశేషం.

మరి సినిమా యాక్టర్ రియల్ లవ్ స్టోరీ అంటే ఆసక్తి జెనరేట్ అవుతుంది కదా.. అదేదో చెప్పమంటే.. 'నా లవ్ స్టోరీని సినిమాగా తీసే ఆలోచన ఉంది. అసలు నేను ఇండస్ట్రీకి డైరెక్ట్ అవుదామనే వచ్చాను. అసిస్టెంట్ గా చేసి ఆ తర్వాత ఎప్పటికో డైరెక్టర్ అవడం అనే రూట్ కాకుండా కొత్తగా ప్రయత్నిద్దామని అనుకుంటున్నా. అప్పుడు నా లవ్ స్టోరీనే మొదటగా సినిమా తీస్తా. ఎప్పుడు డైరెక్షన్ చేస్తానో చెప్పలేను కానీ.. ఇప్పుడైతే ఆ కథ చెప్పను' అనేశాడు శ్రీ విష్ణు.

,  ,  ,  ,  ,  ,  ,