Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Feb-2017 10:58:49
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో ఉన్నాడని గతంలో చెప్పుకున్నాం. మురుగదాస్ మూవీకి ఓ బ్రేక్ ఇచ్చి మరీ.. డీ టాక్సినేషన్ కోసం థాయ్ ల్యాండ్ వెళ్లాడు. మహేష్ తో మరుసటి చిత్రం తీయనున్న కొరటాల శివ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుని.. తన స్క్రిప్ట్ కి మహేష్ సూచనలను అనుగుణంగా తుది మెరుగులు దిద్దుతూ ఫైనల్ వెర్షన్ చెక్కుతున్నాడు.

సాధారణంగా థాయ్ ల్యాండ్ అంటే అందరూ బ్యాంకాక్ నే ప్రిఫర్ చేస్తారు. కానీ మహేష్ అండ్ కొరటాల మాత్రం లొకేషన్ మార్చేశారు. ఆ దేశంలోని సహజమైన బీచ్ లలో ఒకటి అయిన హువా-హిన్ లో ఉన్నారు వీరిద్దరు. ఆ దేశానికి చెందిన పురాతన ఆనవాళ్లన్నీ ఇప్పటికీ భద్రంగా చూసుకుంటున్న ఎంతో అందమైన ప్రాంతం హువా-హిన్. ఇక్కడి ఓ హెల్త్ రిసార్ట్ లోనే ఉన్నారు డైరెక్టర్ అండ్ హీరో. కొరటాల కేవలం రిసార్ట్ కే పరిమితమైతే.. మహేష్ మాత్రం డీ టాక్సినేషన్ ప్లస్ డైరెక్టర్ తో డిస్కషన్స్ చేస్తున్నాడు.

థాయ్ నుంచి తిరిగి రాగానే మురుగదాస్ మూవీ షూటింగ్ లో పాల్గొని.. పూర్తయ్యే వరకూ బ్రేక్ తీసుకోకుండా ఫినిష్ చేస్తాడట మహేష్. ఏప్రిల్ నెల చివర్లో కొరటాలతో మూవీని ప్రారంభించేయాలనేది సూపర్ స్టార్ ఆలోచన. భరత్ అను నేను అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. హీరోయిన్ గా కొత్తమ్మాయిని పరిచయం చేసేందుకు చూస్తున్నారు ఈ హీరో అండ్ డైరెక్టర్.

,  ,  ,  ,  ,  ,