Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2017 13:04:54
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మోత్సవం సినిమా మహేశ్ అభిమానులును తీవ్రంగా నిరాశ పరిచింది. కానీ ఆ వెంటనే వస్తున్న స్పైడర్ సినిమా ఆ లోటును తీరుస్తుంది అనుకుంటే ఆ సినిమా అలా అలా వాయుదాలు వేసుకుంటూపోతోంది. ఈ సినిమా మూడు భాషలలో ఒకేసారి విడుదల చెయ్యాలనే ప్లాన్ ఉండటంతో.. ఈ సినిమా గురించి చాలా జాగ్రతలు తీసుకుంటున్నాడు డైరెక్టర్ మురుగదాస్. అయితే ఈ సినిమా రిలీజవ్వకముందే.. మరో సంచలన సినిమా ఒప్పుకున్నాడు మహేష్.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు మహేశ్ కెరీర్ లోనే పెద్ద హిట్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘భరత్ అను నేను’ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం పక్కగా ప్లాన్ చేశారు డైరెక్టర్ శివ. మహేశ్ కూడా కొత్త లుక్ లొ కనిపించబోతున్నాడట. ఇప్పటివరకు మహేశ్ తన లుక్ తో ఎప్పుడు ప్రయోగాలు చేయలేదు. ఇప్పుడు భరత్ అను నేను కోసం గడ్డం పెంచుతాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో మహేశ్ ముఖ్య మంత్రి పాత్రలొ కనిపిస్తాడు. దాని కోసమే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబునాయుడు ట్రేడ్ మార్క్ గెడ్డంను రిఫరెన్స్ గా తీసుకుని.. ఆ విధంగా కనిపిస్తాడట.

ఈ కొత్త సినిమా టైటిల్ కూడా పదవీప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పే మాటలానే ఉంది. కాబట్టి మహేశ్ గెడ్డం ఆ మంత్రి కోసమే అన్నమాట. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటున్నారు ఎక్కడ ముందే లీక్ కాకుండా.

,  ,  ,  ,  ,