Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 17:06:56
facebook Twitter Googleplus
Photo

రేపు తన 3వ సినిమాతో దర్శనమిస్తున్నాడు నారా రోహిత్. ఈ సమ్మర్ సీజన్ లో ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మనోడే. అయితే ఇలా వరుసగా ఎందుకు సినిమాలు రిలీజ్ చేస్తున్నావ్ అబ్బాయా అంటే.. మనోడి అదిరిపోయే క్లారిటీ ఇచ్చాడు.

తుంటరి అండ్ సావిత్రి రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. నేనేదో 5 కోట్ల సినిమా చేసి 15 కోట్లు వచ్చేయాలనుకోను. మన పెట్టుబడికి తగినంత వస్తే చాలనుకుంటాను. సో.. గ్యాప్ తక్కువున్నా పర్లేదేమో'' అంటూ క్లారిటీ ఇచ్చాడు రోహిత్. మరి సినిమాల రిజల్ట్ పరిస్థితి ఏంటి? ''డబ్బుల రికవరీ విషయంలో ?తుంటరి? నిర్మాతలు చాలా హ్యపీ కాబట్టి నేను కూడా హ్యపీయే. కాని ?సావిత్రి? సినిమా మాత్రం మేం అనుకున్న రేంజులో సక్సెస్ సాధించలేదు. ఆ ఎఫక్ట్ నా మీద పడింది. చాలా డిజప్పాయింట్ అయ్యాను. కాని ఆ సినిమా ఎక్కడ మిస్ ఫైర్ అయిందో మాత్రం నాకు తెలీదు'' అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన.. ఫెయిల్యూర్ కు కారణాలను అంచనా వేయలేకపోతున్నా అని కూడా చెప్పాడులే.

మరి ఈ శుక్రవారం విడుదలవుతున్న రాజా చెయ్యి వేస్తే సినిమాతో మనోడు తాను కోరుకున్న రేంజు హిట్టు కొడతాడని ఆశిద్దాం. గత రెండు చిత్రాలతో రాని ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టేస్తే.. ఓ పనైపోతుందంతే. ఆ తరువాత దాదాపు ఓ ఐదు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

,  ,  ,  ,  ,