Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 11:44:14
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో టాప్ హీరోలు అంటే ముందుగా పవన్ కళ్యాణ్- మహేష్ బాబుల పేర్లే గుర్తుకొస్తాయి. సహజంగా సినిమాల విషయంలో కానీ.. ప్రమోషన్స్ విషయంలో కానీ సూపర్ స్టార్ సూపర్ అగ్రెసివ్ గా ఉంటాడు. టైటిల్ తో స్టార్ట్ చేసి.. ప్రతీ పండక్కి అప్ డేట్స్ ఇవ్వడం. పోస్టర్లతో హంగామా చేయడం లాంటివి మహేష్ కు అలవాటు. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ లాంటి వాటితో సందడి చేస్తుంటాడు.

ఈసారి మాత్రం మహేష్ హంగామా మిస్ అయిపోతోంది. కానీ ఇదే టైంలో పవర్ స్టార్ మాత్రం కాటమరాయుడు విషయంలో బాగా యాక్టివ్ అయిపోయాడు. ఇంకా సినిమా రిలీజ్ కి మూడు నెలలకు పైగా టైం ఉన్నా.. అప్పుడే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసినట్లు కనిపిస్తోంది. న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్స్ అంటూ వరుసగా కొత్త స్టిల్స్ రిలీజ్ చేస్తుండడమే కాదు.. జనవరి1న టీజర్ విడుదల చేస్తున్నట్లుగా కూడా నిర్మాతలు అఫీషియల్ గా చెప్పేశారు.

మరోవైపు మహేష్ మాత్రం ఇంకా తన సినిమాకి టైటిల్ కూడా పైనల్ కాలేదు. సంభవామి అనే పేరు వినిపిస్తోంది కానీ.. ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ నచ్చడం లేదంటున్నారు. తమిళ హీరో భరత్ నటిస్తున్నాడని చెప్పిన తర్వాత... మురుగతో చేస్తున్న ఈ మూవీకి సంబంధించి కొత్త అప్డేట్స్ ఏమీ రాలేదు. ఇద్దరూ సమ్మర్ కే తమ సినిమాలను షెడ్యూల్ చేసినా.. పబ్లిసిటీ టెక్నిక్స్ మాత్రం రివర్స్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది

,  ,  ,  ,  ,  ,