Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2015 10:40:35
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు నటించే కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం' ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓపక్క స్క్రిప్టు పని చేసుకుంటూ, మరోపక్క ఆర్టిస్టుల ఎంపిక కూడా చూసుకుంటున్నాడు. ఇటీవలే ఈ చిత్రంలో నటించడానికి ఆర్టిస్టులు కావాలంటూ కేస్టింగ్ కాల్ ఇచ్చిన సంగతి విదితమే. దీనికి ఔత్సాహికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందట. కాగా, ఈ చిత్రం షూటింగును మే నెలాఖరుకు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పీవీపీ సినిమా అధినేత పొట్లూరి ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం మహేష్ నటిస్తున్న 'శ్రీమంతుడు' చిత్రం షూటింగ్ జరుగుతోంది.

,  ,  ,  ,  ,  ,