Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 12:16:16
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది. ఓ జోనర్ లో సినిమా హిట్ అయితే.. వరుసగా అలాంటి సినిమాలే క్యూ కట్టేయడం కామన్. కామెడీ - రొమాన్స్ - మాస్ - ఫ్యామిలీ.. ఇలా స్పెషల్ జోనర్ లు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం రొమాంటిక్ సినిమాల సీజన్ ప్రారంభం కానుండడం విశేషం. జూన్ నెలలో వరుసగా రొమాంటిక్ లవ్ స్టోరీలన్నీ క్యూ కట్టేశాయి.

ఏప్రిల్ లో మాస్ సినిమాలు వచ్చాయి. మే నెల ఫ్యామిలీకి సరిపోతోంది. ఇప్పుడు జూన్ నెలని టాలీవుడ్ జనాలు రొమాన్స్ కి అంకితం ఇచ్చేసినట్లుగా కనిపిస్తోంది. మొదటగా ఈ సీజన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ అ..ఆ.. తో ప్రారంభం కానుంది. నితిన్ సమంత జంటగా నటించిన ఈ మూవీపై ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత ఆసక్తి ఉంది. మెగా డాటర్ నీహారిక కొణిదెల నటించిన మొదటి మూవీ ఒక మనసు కూడా జూన్ నెలలో విడుదలకు సిద్ధమైంది. నాగశౌర్య - నీహారికల మధ్య లవ్ - రొమాన్స్.. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక అక్కినేని నాగచైతన్య మూవీ ప్రేమమ్ కూడా జూన్ లోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు చైతు. అనుపమా పరమేశ్వరన్ - మడొన్నా సెబాస్టియన్ - శృతి హాసన్ లతో ప్రేమ కథలు చూపించబోతున్నాడు అక్కినేని వారసుడు. మొత్తానికి జూన్ అంతా రొమాన్స్ సినిమాల సందడే కనిపించనుంది.

,  ,  ,  ,  ,  ,  ,