Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2015 17:17:07
facebook Twitter Googleplus
Photo

ఏమాత్రం వీలు చిక్కినా ఫ్యామిలీతో వాల్యూ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు మహేష్. భార్య నమ్రత - పిల్లలు గౌతమ్ - సితార .. ఇదే లోకంగా బతికేస్తుంటాడు. ఎంత బిజీగా ఉన్నా అతడు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అందరికీ ఇన్ స్పిరేషన్ గా ఉంటుంది. శ్రీమంతుడు సక్సెస్ అందుకున్న వెంటనే థాయ్ బీచ్ లలో రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీ ట్రిప్ వేశాడు.

ఆ తర్వాత తిరిగి వచ్చి వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం షూటింగుతో బిజీ అయిపోయాడు. ఈ సినిమా షెడ్యూల్ పూర్తయ్యాక మళ్లీ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లోనే మరోసారి ప్రిన్స్ తన కుటుంబాన్ని ప్యారిస్ తీసుకెళ్లి ఎంజాయ్ చేశాడు. ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకుని తిరిగి కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే సమయానికి రిటన్ అయిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇక నుంచి నిత్యం బ్రహ్మోత్సవమే!

ప్రిన్స్ ప్రస్తుతం హైదరాబాద్లో సాగే సుదీర్ఘ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ షెడ్యూల్ లో నాయకానాయికలు సహా భారీ తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉంది. సమంత - కాజల్ - ప్రణీత వంటి అందమైన భామలు ఈ చిత్రంలో ప్రిన్స్ సరసన ఆడిపాడుతున్నారు. పివిపి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. అదీ మ్యాటరు.

,  ,  ,  ,  ,