Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2015 11:37:37
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రానుందా? ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ఇదే. అయితే ఈ సూపర్ స్టార్లిద్దరూ కలసి నటించడం లేదులెండి. ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఆ వివరాల్లోకి వెళితే, పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో 'కోబలి' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం స్క్రిప్టు పని కూడా జరుగుతోంది. ఈ చిత్రానికి మహేష్ బాబు కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరించవచ్చని అంటున్నారు. మహేష్ బాబు తాజాగా 'జి. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. దీంతో మహేష్, పవన్ లకు సన్నిహితుడైన త్రివిక్రమ్ తమ చిత్రానికి మహేష్ ను కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించమని అడిగినట్టు, ఆయన సరే అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, పవన్-మహేష్ అభిమానులకు ఇక పండగే! ఆ సినిమాకి ఇక ఆకాశమే హద్దు అవుతుంది కదూ!

,  ,  ,  ,  ,