Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 11:11:03
facebook Twitter Googleplus
Photo

కబాలి చిత్రాన్ని ఇంటర్నెట్లో ప్రసారం నిషేధించాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను గురువారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకెళితే రజనీకాంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ భారీ అంచనాల మధ్య త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇలాంటి పరిస్థితితుల్లో ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను గురువారం మదాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంటూ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిత్రం విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఇంటర్నెట్లలో అనధికారంగా ప్రసారం అవుతున్నాయన్నారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే పైరసీ సీడీలు వెలువడుతున్నాయని తెలిపారు. అందువల్ల భారీ వ్యయంతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్నారు. పైరసీని అరికట్టడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నా, కఠిన చర్యలు చేపట్టడం లేదన్నారు.

మన దేశంలో 169 ఇంటర్నెట్ ప్రసార నిర్వాహకాలు ఉన్నాయని తెలిపారు. అందులో పని చేసే వారే పైరసీకి పాల్పడుతున్నారని అన్నారు. ఈ ఇంటర్నెట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటే పైరసీని అరికట్టవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.ఇంతకు ముందు ఇందియావిన్ మగళ్ అనే చిత్రాన్ని ఇంటర్నెట్‌లో ప్రసారం చేసినందుకు ఆ ఇంటర్నెట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే చర్యలు చేపడతాయని ప్రకటించిందన్నారు.

దీంతో వెంటనే ఆ చిత్రాన్ని ఆ ఇంటర్నెట్‌నుంచి తొలగించారన్నారు.కాబట్టి కొత్త చిత్రాలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తే వారి గుర్తుంపును రద్దు చేయాలని కేంద్రప్రభుత్వానికి ఆదేశించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఆ కేసు న్యాయమూర్తి కృపాకరన్ సమక్షంలో గురువారం సాయంత్రం విచారణకు వచ్చింది.

,  ,  ,  ,  ,  ,  ,  ,