Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2015 13:52:02
facebook Twitter Googleplus
Photo

ఇదేదో టి.వి షోలో కొత్త ప్రోగ్రాం అనుకుంటే మీరు పొరబడ్డట్టే... ఈ ఏడాది ద్వితీయార్ధంలో తన కెరీర్ బెస్ట్ సినిమాగా శ్రీమంతుడుని అందించిన మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే శ్రీమంతుడు సినిమాల మహేష్ బాబు వాడిన సైకిల్ విడుదలకు ముందే వార్తలలో నిలిచింది. దాదాపు మూడున్నర లక్షల విలువ చేసే ఈ సైకిల్ ని సినిమా కోసం ప్రత్యేకంగా తెప్పించారు. ఇప్పుడు ఈ సైకిల్ ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం.

మహేష్ తొక్కిన సైకిల్ కాబట్టి అందులోనా కాస్ట్లీ సైకిల్ కాబట్టి దీన్ని ఎంతకైనా కొనచ్చు. మర్యాద రామన్న సినిమాలో సునీల్ సైకిల్ వేలానికి పెడితే భారీ ధర పలికింది. కానీ అతని అభిమానులకు అందుబాటులో వుండడం కోసం ఈ సైకిల్ ధర 999గా నిర్ణయించారు. అంటే సైకిల్ కావాలనుకున్న వారు ఎవరైనా 999పెట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. వారిలో లక్కీ డిప్ లో విజేతగా నిలిచిన వారికి ఈ సైకిల్ దక్కుంతుందన్నమాట. మరి మిగలిన వారి పరిస్థితి ఏమిటి అంటారా?? మిగిలినవారందరికీ మహేష్ ఆటోగ్రాఫ్ కలిగిన ఒక టీ షర్టు ని బహుమతిగా అందజేస్తారట. ఐడియా బాగుందికదూ.. ఇంకెందుకు ఆలస్యం.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి..

,  ,  ,  ,