Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2017 10:41:55
facebook Twitter Googleplus
Photo

సంఘమిత్ర.. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ విపరీతమైన సెన్సేషన్స్ సృష్టించింది. 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్.. 8వ శతాబ్దానికి చెందిన వీర నారి కథ.. అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందే విజువల్ వండర్.. కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రారంభం.. ఇన్నేసి న్యూస్ తర్వాత.. సంఘమిత్ర రోల్ చేయాల్సిన శృతి హానస్ తప్పుకోవడం ఇంకా పెద్ద సంచలనం అయింది.

ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి శృతి హాసన్ ను తప్పించడం/తప్పుకోవడంపై బోలెడన్ని సందేహాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిం శృతి. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ బెహన్ హోగీ తేరీ రిలీజ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ భామ.. సంఘమిత్ర విషయంలో అసలేం జరిగిందో చెప్పింది. 'సంఘమిత్ర స్టోరీతో పాటు ఆ కేరక్టర్ నుంచి నాకు బాగా తెలుసు. మూవీ అద్భుతంగా ఉండడం ఖాయం. అయితే.. రెండేళ్ల పాటు సమయం వెచ్చించాల్సిన ప్రాజెక్టు కోసం తగిన విధంగా స్క్రిప్ట్.. షూటింగ్ కేలండర్ లేకుండా వెయిట్ చేయడం అంటే.. నా కెరీర్ మొత్తాన్ని పణంగా పెట్టేసినట్లు అవుతుంది. అందుకే తప్పుకోవాల్సి వచ్చింది' అని వివరణ ఇచ్చింది శృతి హాసన్.

ఆ పాత్రలో ఎవరు కనిపించినా చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో సంఘమిత్ర ఉంటుందని చెప్పిన శృతి.. ఇంతకంటే ఎక్కువ వివరాలను వెల్లడించడం భావ్ంయ కాదని అంటోంది.

,  ,  ,  ,