Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2015 17:39:27
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ మూవీ మజ్ను. కెరీర్ లో కీలకమైన టర్నింగ్ ఇచ్చిన సినిమా ఇది. నాగ్ని లవర్ బోయ్ ని చేసిన సినిమా ఇది. మగువల గుండెల్లో మారాజును చేసిన సినిమా కూడా ఇదే. ఊర్వశి రావే .. ప్రేయసి రావే.. అంటూ ఈ సినిమాలో మందు కొడుతూ మజ్నుగా అభినయించిన తీరు ప్రేయసి కోసం విరహ వేదనను అభినయించడంలో తండ్రి ఏఎన్నార్ నే మించిపోయాడు నాగార్జున అని ప్రశంసించారు.

ఇక అక్కినేనికి దేవదాసు ఎలానో నాగార్జునకి మజ్ను సినిమా అలా. అంతటి ఐడెంటిటీ ఉన్నా ఆ సినిమా టైటిల్ ఇప్పుడు చైతూ సినిమాకి టైటిల్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్ ఇది. చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్ ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మజ్ను అనే టైటిల్ ని నిర్ణయించారన్నది హాట్ టాపిక్.

టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమాలో నాగచైతన్య లవర్ బోయ్ గా కనిపిస్తాడు. ముగ్గురు మగువలతో రొమాన్స్ చేసే చాక్లెట్ బోయ్ గా ఆకట్టుకుంటాడు. ఇప్పటికే ఇద్దరు నాయికలు కన్ఫమ్ అయ్యారు. అనుపమ పరమేశ్వరన్ - అమైరా దస్తర్ నాయికలుగా ఫిక్సయ్యారు. మరో నాయికగా అనుష్క పేరు వినిపిస్తోంది. ఆ మజ్ను హిట్ కొట్టాడు. ఈ మజ్ను ఏం చేస్తాడో?

,  ,  ,  ,