Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 10:48:14
facebook Twitter Googleplus
Photo

తండ్రుల పేర్లు చెప్పుకోని కూతుళ్లు హీరోయిన్స్ అయిపోవడం బాలీవుడ్ లో చాలా ఈజీ. కానీ సౌత్ లో మాత్రం అంత తేలిక కాదు. మంచు లక్ష్మీ.. నీహారిక లాంటి వాళ్లు దీనికి మినహాయింపు. అందుకే మన దగ్గర స్టార్ డాటర్స్ ఆన్ స్క్రీన్ లో కనిపించడం కన్నా ఆఫ్ స్క్రీన్లో టాలెంట్ చూపించడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికే తమిళ్ లో రజనీకాంత్ కూతుళ్లు డైరెక్టర్స్ గా మారారు. త్వరలో తెలుగులోనూ అలాంటి దృశ్యమే కనిపించబోతుంది.

సూపర్ స్టార్ క్రిష్ణ కూతురు మంజుల డైరెక్టర్ గా మారబోతుంది. సినిమా ఫీల్డ్ మీదున్న ఇష్టం.. ప్యాషన్ ఎలాంటిదో మంజుల చాలాసార్లు చెప్పింది. నటిగా.. నిర్మాతగా షో లాంటి భిన్నమైన చిత్రంతో జాతీయ అవార్డు కూడా గెల్చుకొన్న మంజుల- కావ్యాస్ డైరీ.. ఆరెంజ్ తో పాటు కొన్ని తమిళ్.. మలయాళం మూవీస్ లోనూ యాక్ట్ చేసింది. అయితే ఎప్పట్నుంచో దర్శకత్వ ఆలోచనలున్న మంజుల ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతుంది.

మంజుల తీసే సినిమాలో హీరోగా సందీప్ కిషన్ నటించనున్నాడు. జెమిని కిరణ్ నిర్మిస్తోన్న ఈచిత్రానికి క్రిష్ణం వందే జగద్గురుమ్.. గోపాల గోపాల.. కంచె చిత్రాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి మాటలు రాస్తుండగా.. హీరోయిన్ సహా మిగిలిన టెక్నీషియన్స్ ఫైనల్ కావాల్సి ఉంది. ఫిబ్రవరిలో మంజుల సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయ్. మరి నిర్మాతగా మంచి మూవీ అందించిన మంజుల దర్శకురాలిగా కూడా విభిన్నమైన సినిమాని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఘట్టమనేని అభిమానులు.

,  ,  ,  ,  ,  ,