Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2017 11:55:42
facebook Twitter Googleplus
Photo

సౌత్ ఇండియాలో ఒక్కో ఇండస్ట్రికి ఒక్కో కాలంలో కొంతమంది సూపర్ స్టార్లు ప్రేక్షకులును అలరిస్తూ వచ్చారు. మన తెలుగులో ఇప్పటి పెద్ద హీరోలు ఆ నలుగురు రాజ్యం ఏలుతున్న సమయంలోనే తమిళనాడులో రజిని - కమల్ - మలయాళంలో మోహన్ లాల్ - మమ్మూట్టి లాంటివారు ఒకే తరం సూపర్ స్టార్లుగా చెప్పుకోవచ్చు. ఈ మెగా సూపర్ స్టార్లు అందరిలోనూ ఒక్కొకరికి ఒక్కో విదమైన స్టైల్ ఉంది అభిమానులలో వీళ్ళు అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సూపర్ స్టార్లలో ఒకడైన మమ్మూట్టి తన 400 వ సినిమా చేయబోతున్నాడు.

తన నటనతో మలయాళం ప్రేక్షకులనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలో అభిమానులను సంపాదించుకున్నాడు. తన 35 ఏళ్ళు సినీ ప్రయాణంలో మమ్మూట్టి 399 సినిమాలు పూర్తి చేశాడు. ఇప్పుడు తన పుట్టినరోజు నాడు అంటే సెప్టెంబర్ 7 న తన నటించబోతున్న 400 సినిమా వివరాలు వెల్లడించబోతున్నారు. మమ్మూట్టి మన తెలుగులో కూడా కొన్ని హిట్ సినిమాలులో నటించి మెప్పించారు. స్వాతికిరణం - దళపతి లాంటి సినిమాలలో నటించి తన మార్క్ నటనతో ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా నటించారు.

ఇప్పుడు తన 400 సినిమాను ఫేమస్ డైరెక్టర్ అమల్ నీరద్ డైరెక్ట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. మమ్మూట్టి హిట్ సినిమాలలో ఒకటైన సినిమాను సీక్వెల్ గా చేయబోతున్నారు అని చెబుతున్నారు. ఏ సినిమా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియవలిసిఉంది.

,  ,  ,  ,  ,