Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 10:37:56
facebook Twitter Googleplus
Photo

మధ్య బిస్కెట్ అనగానే అవతలివాళ్లను పొగడ్డానికి చెప్పే సొల్లు కబుర్లు అనే మీనింగ్ వచ్చేస్తోంది. ఇలా భాషను మార్చేసింది కూడా సినిమా జనాలే. అయితే.. ఇప్పుడు కాజల్ నిజంగానే బిస్కెట్లతో తెగ ఫోజోలు ఇచ్చి నెట్ లో పెట్టేసింది.

అయితే.. ఇవేవీ ఎవరికో వేయడానికి కొనుక్కొచ్చిన బిస్కెట్స్ కాదండోయ్. టాలీవుడ్ చందమామ స్వయంగా తనే తయారు చేసిన బిస్కెట్స్. బిస్కెట్స్ చేసుకుంటోంది కదా అని.. ఇంటి దగ్గర ఖాళీగా ఉందని అనుకుంటున్నారేమో.. అది కూడా తప్పే. ఎందుకంటే.. ఈ బిస్కెట్ మేకింగ్ తతంగం అంతా చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సాగిన వ్యవహారం. వంట పై నాకున్న ఇష్టాన్ని ఇంటికి దూరంగా ఉన్నా తీసుకెళ్లిపోతున్నా. చెన్నైలోని పార్క్ హయత్ లోని బేకరీ ఇది. డార్క్ చాకొలేట్.. సీ సాల్ట్ కుకీస్.. ఆల్మండ్ బిస్కటి విత్ ఆరెంజ్ రెడ్ లను తయారు చేశా. సమయం.. ఓపిక.. అద్భుతమైన కిచెన్ అందించినందుకు టీంకు ధన్యవాదాలు అని చెప్పింది కాజల్ అగర్వాల్.

పనిలో పనిగా.. తన బిస్కెట్ మేకింగ్ ను ఫోటోల రూపంలో కూడా అభిమానులకు అందించేసింది.

,  ,  ,  ,  ,