Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Feb-2015 11:38:37
facebook Twitter Googleplus
Photo

గతంలో జగపతిబాబు, సౌందర్య జంటగా 'దొంగాట' అనే చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇదే టైటిల్ తో మరో చిత్రం వస్తోంది. మంచు లక్ష్మి నటించే కొత్త చిత్రానికి ఈ 'దొంగాట' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో అడవి శేష్ ఆమె సరసన జంటగా నటిస్తున్నాడు. గౌతమ్ మీనన్ వద్ద పనిచేసిన వంశీ కృష్ణ అనే కుర్రాడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి నిర్మిస్తుండడం విశేషం. ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో దీని షూటింగ్ జరుగుతోంది. క్రైమ్ కామెడీతో ఇది తెరకెక్కుతోంది.

,  ,  ,  ,  ,