Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2016 10:53:21
facebook Twitter Googleplus
Photo

సూర్యను చూస్తే కొంచెం క్లాస్ గా కనిపిస్తాడు. కానీ అతను మాస్ క్యారెక్టర్లలోనూ అదరగొడతాడని.. ఫెరోషియస్ క్యారెక్టర్లకూ న్యాయం చేయగలడని రుజువు చేసిన సినిమా ?సింగం?. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగ ప్రేక్షకుల్నీ ఉర్రూతలూగించాడు సూర్య. ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ లో ఇప్పుడు మూడో సినిమా రాబోతోంది. హరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ?ఎస్-3? షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ అంచనాలున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు.

డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ?ఎస్-3?. ఈ చిత్రాన్ని తన కజిన్ జ్నానవేల్ రాజాతో కలిసి సూర్యనే స్వయంగా నిర్మించాడు. సింగం సిరీస్ లో రెండో భాగం కొంత వరకు విదేశాల్లో సాగుతుంది. ఎస్-3 మెజారిటీ పార్ట్ ఫారిన్లోనే ఉంటుందట. సూర్య సరసన అనుష్కతో పాటు శ్రుతి హాసన్ కథానాయికలుగా నటించారు. సింగం సిరీస్ తొలి రెండు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తే.. మూడో భాగానికి మాత్రం హ్యారిస్ జైరాజ్ లైన్లోకి వచ్చాడు. దీపావళికే రావాల్సిన ఈ సినిమా డిసెంబరుకు వాయిదా పడింది. అయినప్పటికీ ఎస్-3 ని మంచి టైమింగ్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. క్రిస్మస్ హాలిడేస్ కు ముందు వారమే రాబోతున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సంక్రాంతి వరకు హవా సాగించవచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,