Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jan-2017 11:04:41
facebook Twitter Googleplus
Photo

మంచు ఫ్యా3మిలీకి గత రెండేళ్లుగా అంతగా కలిసి రావట్లేదు. పోయినేడాది వచ్చిన మంచు విష్ణు సినిమా ఈడోరకం ఆడోరకం మినహాయిస్తే అన్నీ ఫ్లాపులే ఎదురయ్యాయి ఆ ఫ్యామిలీకి. విష్ణు ఎర్రబస్సు.. డైనమైట్ లాంటి డిజాస్టర్లను ఎదుర్కొంటే.. మనోజ్ కు శౌర్య.. అటాక్ లాంటి చేదు అనుభవాలు మిగిలాయి. మంచు లక్ష్మికి దొంగాట.. బుడుగు నిరాశనే మిగిల్చాయి. ఈ ముగ్గురూ 2017పై చాలా ఆశలతోనే ఉన్నారు. విశేషం ఏంటంటే.. ఈ అక్కా తమ్ముళ్ల ముగ్గురి సినిమాలూ ఫిబ్రవరిలోనే విడుదల కాబోతున్నాయి.

ముందుగా మంచు విష్ణు లక్కున్నోడు సినిమాతో ఫిబ్రవరి 3న పలకరించబోతున్నాడు. రాజా కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఢీ.. దూసుకెళ్తా తరహాలో మంచి ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ఈ సినిమా వచ్చిన వారానికే మంచు మనోజ్ రంగంలోకి దిగబోతున్నాడు. అతడి కొత్త సినిమా గుంటూరోడు ఫిబ్రవరి 10న థియేటర్లలోకి దిగుతుందట. ఎస్కే సత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది.

వీళ్లిద్దరూ కాక మంచు లక్ష్మి కూడా ఫిబ్రవరిలోనే రాబోతుండటం విశేషం. ఆమె లీడ్ రోల్ చేసిన లక్ష్మీ బాంబు సినిమా మూణ్నెల్ల ముందే రావాల్సింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫిబ్రవరిలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. 17 లేదా ఇంకో డేట్ కోసం చూస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీకి ఫిబ్రవరి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,