Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2016 16:53:24
facebook Twitter Googleplus
Photo

మంచు మనోజ్ కుమార్ స్పీడ్ పెంచాడు. శౌర్య - అటాక్ ల ఫెయిల్యూర్స్ తర్వాత.. జాగ్రత్తగా స్క్రిప్టులు ఎంచుకుంటున్న మనోజ్.. ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మే 20న 3 కొత్త సినిమాల వివరాలు అనౌన్స్ చేస్తానని ముందు రోజే చెప్పిన మంచు వారబ్బాయి.. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన డీటైల్స్ ఇచ్చేశాడు.

మొదట సీతామహాలక్ష్మి అనే సినిమాను చేస్తాడు మనోజ్. పి.సాగర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ ఇవ్వనుండగా.. మనోజ్ తనే నిర్మాణం వహించనున్నాడు. ఈ మూవీకి స్టంట్స్ కూడా మనోజ్ స్వయంగా సమకూర్చుతుండడం విశేషం. సీతామహాలక్ష్మి మూవీకి మదర్ ఆఫ్ రాంబో అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఇక మనోజ్ రెండో ప్రాజెక్ట్ క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై తొలి మూవీగా తెరకెక్కుతుంది. ఎస్ కే సత్య దర్శకత్వం వహించనుండగా.. అట్లూరి శ్రీవరుణ్ నిర్మాత. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

మనోజ్ ప్రారంభించనున్న మూడో ప్రాజెక్ట్ ను ఎస్ ఎన్ ఆర్ ఫిలింస్ మరియు న్యూఎంపైర్ సెల్యూలాయిడ్స్ లు సంయుక్తంగా నిర్మిస్తాయి. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు కాగా.. ఎస్ ఎన్ రెడ్డి - ఎన్ లక్ష్మీకాంత్ లు నిర్మాతలు. మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డానికి స్పీడ్ పెంచడం తప్పనిసరి అని మనోజ్ ఫిక్స్ అయినట్లున్నాడు. అందుకే ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించాడనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,