పలానా చిత్రంలో పలానా హీరో నటిస్తున్నాడంటూ గొప్పగా ఎలా అయితే చెప్పుకుంటారో, పలానా చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నాడంటూ కూడా చెప్పుకుంటారు. అంటే, రెహ్మాన్ మ్యూజిక్ చేయడానికి ఒప్పుకోవడం అంటే మాటలు కాదు. పారితోషికం మాట అటుంచినా, అతనికి సినిమా కథ, యూనిట్ నచ్చాలి. అప్పుడే ఒప్పుకుంటాడు. ఇప్పుడు తాజాగా తమిళ హీరో సూర్యా చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకోవడం విశేషం.
arrehman, surya, vikramkumar, tollywood,