Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2015 16:46:31
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ఇద్దరు హీరోల గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఇద్దరికీ ఓ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కావాల్సిన టైమ్ ఇది. హిట్టు కొడితే చాలదు బ్లాక్ బస్టర్ హిట్ కొడితేనే ముందుకు లేదంటే స్టెప్ వెనక్కిపడినట్టే. అలాంటి కీలక సందర్భాన్ని ఈ ఇద్దరూ ఎలా నెగ్గుకొస్తారా? అన్న చర్చ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆ హీరోలెవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. మంచు విష్ణు నాని. ఈ ఇద్దరికీ హిట్లున్నా .. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్లు కొట్టలేదు. డిస్ట్రిబ్యూటర్ బయ్యరు ఎగ్జిబిటరు లాభపడిన సందర్భాలు లేవు. అందుకే ఈ ఇద్దరి కెరీర్లో ఆ బ్లాంక్ స్పేస్ అలానే ఉండిపోయింది. సరిగ్గా ఈ టైమ్ లో విష్ణు దేవాకట్టా లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు. డెప్తున్న కంటెంట్ తో డైనమైట్లా తీర్చిదిద్దాడు దేవా అంటూ టాక్ వచ్చింది. టీజర్ లో సంభాషణలు చూస్తే విషయం కనిపిస్తోంది. ఇక నానికి అలా మొదలైంది పిల్ల జమీందార్ లాంటి హిట్లు ఉన్నా తప్పుల తడకల వల్ల రేసు లో వెనక్కి వెళ్లాడు. ఈ టైమ్ లో అతడిని ఎవడే సుబ్రహ్మణ్యం ఆదుకుంది. అయినా ఇవేవీ కమర్షియల్లీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావు. అందరికీ లాభాలిచ్చిన సినిమాలు కానేకావు.

అందుకే ఇప్పుడు భలే భలే మగాడివోయ్ ఆ లోటు తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీజర్ పాటలు వీడియోల్లో చూపించిన కంటెంట్ యూత్ కి ఎక్కేసింది. కాబట్టి ఈ సినిమాపైనా అంచనాలున్నాయి. ఈ శుక్రవారమే జాతకాలు తేలే రోజు. వెయిట్ అండ్ సీ.

,  ,  ,