Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 10:21:46
facebook Twitter Googleplus
Photo

రంగస్థలం 1985 సినిమా మొదలైనప్పటి నుండి సినిమా విశేషాలు గురించి జనాలు తెగ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అందుకు ధీటుగానే సుకుమార్ అందుకు రామ్ చరణ్ టీమ్ పక్కా ప్లాన్ తో సినిమాకు సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ మధ్య ఒక మీడియాతో సంభాషిస్తూ సుకుమార్ మాత్రం తన హీరో గురించి ఒక పెద్ద కామెంటే చేశాడు.

రామ్ చరణ్ గురించి చెప్పమని అడిగినప్పుడు.. “రామ్ చరణ్ చాలా బాగున్నాడు. చాలా కొత్తగా రెడీ అవుతున్నాడు మీకోసం. మీరు ఇంత వరకు చూసిన చరణ్ కు రంగస్థలం లో మీరు చూడబోయే చరణ్ కు చాలా తేడా ఉంటుంది. నేను ప్రమాణం చేస్తున్నా రామ్ చరణ్ నటన అదిరిపోయేలా ఉంటుంది'' అని చెప్పాడు. ఈ ఒక్క ప్రామిస్ తో మెగా ఫ్యాన్స్ అందరూ ఎక్సయిట్ అయిపోతున్నారంతే. ఎందుకంటే ఇప్పటివరకు చెర్రీ ఎక్కువగా మాస్ సినిమాలు ఎంచుకుని.. సడన్ గా 'ధృవ' సినిమాతో రూటు మార్చాడు. ఇప్పుడు సుకుమార్ సినిమాతో ఇంకాస్త పద్దతి మారిస్తే.. ఆ రొటీన్ కమర్షియల్ సినిమాల ట్యాగ్ దూరమవుతుందని వీరి ఆశ. మారుమూల పల్లెటూరు లో గోదావరి పచ్చని పొలాలు మధ్య షూటింగ్ జరుపుకుంటున్న రంగస్థలం 1985 పేరులో ఉన్న కాలం నాటి కథే అని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కానీ సమంత కానీ ఒక పల్లెటూరు జంట ఎలా ఉంటారో అలానే ఉంటారట.

ఇక కొందరు మహేశ్ బాబుతో సినిమా ఎప్పుడు తారక్ తో సినిమా ఎప్పుడు అని సుకుమార్ ను అడగ్గా.. టూకీగా సమాధానం చెబుతూ చేయాలి చేస్తాను కాకపోతే కొంచం టైమ్ పడుతుంది అని చెప్పాడీ దర్శకుడు.

,  ,  ,  ,  ,