Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 12:24:27
facebook Twitter Googleplus
Photo

తెలుగు తమిళ్ సినిమాలో మహానటిగా చరిత్రలో మిగిలిపోయిన కొమ్మారెడ్డి సావిత్రి జీవిత కథను సినిమాగా తీస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రి లాంటి మహా నటులు కళ్ళతోనే నటించేస్తారు. అటువంటి పాత్రలో కనిపించాలి అంటే కొంత అనుభవం కావాలి తప్పనిసరిగా కానీ అందరి అంచనాలును తారుమారు చేస్తూ ఇప్పుడుప్పుడే స్టార్ హీరోయిన్ అవుతున్న మలయాళ భామ కీర్తి సురేశ్ ను ఎన్నుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అప్పటి వరుకు ఉన్న అందరి సందేహాలు పటాపంచలు అయ్యాయి అని చెప్పవచ్చు.

మిస్సమ్మ సినిమాలో సావిత్రి గెటప్ లో కనిపించిన తీరును చూస్తే అవును ఈవిడ అచ్చం సావిత్రి లానే ఉంది అని అందరూ అనుకోకమానరు. కీర్తి కన్నా ముందు విద్యా బాలన్ నిత్య మీనన్ ను అనుకున్నారు కానీ కీర్తి సురేశ్ ని ఫిక్స్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక్కడ ఉన్న పిక్చర్ లో కూడా కీర్తి రెండు జడలు వేసుకొని దేవదాసు మిస్సమ్మ టైమ్ లో సావిత్రి లా ముద్దుగా కాస్త బొద్దుగా కనిపిస్తోంది కదూ. అక్కడ తెల్ల పంచ కట్టుకున్న వారు ఎవరంటారు?

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పుడే మొదలైంది. ఈ మధ్యనే సావిత్రి - ఎన్టీఆర్ లు చేసిన ఒక క్లాసిక్ సాంగ్ ను కీర్తి సురేశ్ తో షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,