Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2017 15:53:29
facebook Twitter Googleplus
Photo

మూవీ వివాదం తారా స్థాయికి చేరిపోయింది. వాస్తవానికి మరో రెండు రోజుల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. పైగా కేంద్రంలో అధికారంలో పార్టీకి సంబంధించిన నేతలే ఈ సినిమాపై అవాకులు చవాకులు పేలుతున్నారు. దీపికా పదుకొనే తలకు ఏకంగా 10 కోట్ల రూపాయల రేటు కూడా కట్టేశారు.

ఈ అంశంపై మంచు విష్ణు నేరుగానే స్పందిస్తున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు ఓటర్ అనే చిత్రంలో నటిస్తుండగా.. తమిళ్ లో కురల్ 388 అనే పేరుపై తెరకెక్కుతోంది. పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాలపై నేరుగానే కామెంట్స్.. సీన్స్ ఉంటాయని చెబుతున్నాడు మంచు విష్ణు. సోషల్ మీడియాలోనే ధైర్యంగా నిలదీసే ఈ హీరో.. ఇప్పుడు పద్మావతి చిత్రంపై కూడా రియాక్ట్ అయ్యాడు. దీపికా పదుకొనే తలకు రేటు కట్టడాన్ని ఖండించాడు.

మా అక్క తలను ప్లేట్లో పెట్టి తీసుకొస్తే ఊరుకుంటానా.. ప్రస్తుతం బీజేపీ చేస్తున్నది కరెక్ట్ గా అనిపిస్తోంది.

,  ,  ,  ,  ,