Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Dec-2015 18:17:16
facebook Twitter Googleplus
Photo

సోనారికా భడోరియాకి మరో ఛాన్స్ ఇస్తున్నాడు మంచు వారబ్బాయి. హిందీ టీవీ సీరియల్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన సోనారిక.. టాలీవుడ్ లో ఇప్పటికే అరంగేట్రం చేసేసింది. నాగశౌర్యతో కలిసి జాదూగాడు మూతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే.. ఈ సినిమా ఆశించిన హిట్ కాకపోయినా.. ఈ భామకు అవకాశాలను మాత్రం బాగానే తెచ్చిపెట్టింది.

గ్లామర్ - పెర్ఫామెన్స్ రెండింటిలోనూ సత్తా చాటుతుండడంతో.. గబగబా ప్రాజెక్టులు సైన్ చేసేసింది. కుర్రాళ్లు కూడా బాగానే అవకాశాలు ఇచ్చారు ఈ చిన్నదానికి. ఇప్పటికే బెల్లకొండ సాయి మూవీతో పాటు.. మంచు విష్ణు సరసన కూడా "శారద"చిత్రంలో సోనారిక నటిస్తోంది. ఇప్పుడీ భామను విష్ణు-రాజ్ తరుణ్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీలో కూడా తీసుకోవడం విశేషం. ఈ మూవీలో కూడా విష్ణు సరసనే నటించనుంది సోనారిక. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ మూవీకి.. అనిల్ సుంకర నిర్మాణం వహించనున్నారు. శారద మూవీలో సోనారిక యాక్టింగ్ ట్యాలెంట్ చూసిన దర్శకనిర్మాతలు.. తమ చిత్రానికి కూడా సైన్ చేయించుకున్నారట.

నిజానికి ఈ రోల్ ని ముందు అమైరా దస్తూర్ చేస్తుందని చెప్పారు. కానీ ఆమె మూవీ నుంచి తప్పుకోవడంతో.. ఇప్పుడు సోనారికను అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొత్తానికి మంచు క్యాంప్ లో సోనిరికా భడోరియా బాగానే పాగా వేసింది.

,  ,  ,