Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jan-2015 10:56:46
facebook Twitter Googleplus
Photo

మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి హీరోలు, హీరోయిన్లు ఉవ్విళ్ళూరుతుంటారు. వాళ్లల్లో తమిళ హీరో ధనుష్ కూడా వున్నాడు. అతని కోరిక త్వరలోనే తీరుతోంది. మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఈ హీరోకి తాజాగా వచ్చినట్టు చెన్నయ్ సమాచారం. ప్రస్తుతం తమిళంలో తాను చేస్తున్న చిత్రం పూర్తవగానే మణిరత్నం హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరో పాత్ర కోసం ధనుష్ ను సంప్రదించినట్టు, ఆఫర్ వినగానే ధనుష్ ఎగిరి గంతేసినట్టూ చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

,  ,  ,  ,  ,