Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2015 11:33:53
facebook Twitter Googleplus
Photo

సుమారు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాలో కమలహాసన్, మనీషా కొయిరాలా జతకట్టిన సంగతి మనకు తెలుసు. ఆ సినిమాలో ఇద్దరి మధ్యా వెండితెర రొమాన్స్ అదిరిపోయింది. ఈ జంట ఇప్పుడు మళ్లీ కలసి నటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కమల్ తన అసోసియేట్ రాజేష్ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో ఆయన పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. త్రిష ఆయన సరసన కథానాయికగా నటిస్తోంది. అయితే, కమల్ భార్య పాత్ర ఒకటి వేరే వుందట. ఆ పాత్ర కోసం ప్రస్తుతం నేపాలీ భామ మనీషా కొయిరాలాను సంప్రదిస్తున్నట్టు చెన్నయ్ సమాచారం. ఆమధ్య కేన్సర్ బారిన పడిన మనీషా అమెరికాలో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకుని, మళ్లీ నటించడానికి రెడీ అవుతోంది.

,  ,  ,  ,