Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 11:05:18
facebook Twitter Googleplus
Photo

బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. గోవాలో రేపు - ఎల్లుండి ఇరు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరగబోతోంది. ఈ వేడుకకు ఇప్పటికే ఇరుకుటుంబాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. రేపు ఈ సమయానికి చైతు సమంత హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటి కాబోతున్నారు.

అయితే చైతు- సమంత ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించారు. ఏ మాయ చేసావే - ఆటో నగర్ సూర్య అలాగే మనం సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరూ పెళ్లి తర్వాత కలిసి నటించబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. నాగ చైతన్య మారుతి దర్శకత్వంలో ఒక కథను ఒకే చేశాడు. ఆ సినిమా కథ కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య ఉండే ఈగో నేపథ్యంలో ఉంటుందని ఇదివరకే చైతు చెప్పాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో చైతు సరసన సమంత నటించడం లేదని తెలుస్తోంది.

అసలైతే దర్శకుడు మారుతి సమంతనే కథానాయికగా ఎంచుకోవాలని అనుకున్నాడట.

,  ,  ,  ,  ,