Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2017 11:37:46
facebook Twitter Googleplus
Photo

మారుతి సమర్పణలో అంటే మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చేసేవి. అయితే.. అన్నీ ఆ బాపతు సినిమాలకే ఇలాంటి ప్రచారం జరగడంతో మెల్లగా తనను తాను క్లీన్ కామెడీ వైపునకు మార్చుకున్నాడు మారుతి. భలే భలే మగాడివోయ్.. రీసెంట్ గా మహానుభావుడు వంటి చిత్రాలతో తనలోని బూతు లేని హ్యూమర్ ను పంచాడు కూడా.

రైటర్ కూడా సత్తా చాటే మారుతి.. తను నిర్మాతగా తన అసోసియేట్స్ దర్శకత్వంలో అడపాదడపా సినిమాలు చేస్తుంటాడు. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న మారుతి టీం.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా కన్నేసింది. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ మూవీ తీసేందుకు రెడీ అవుతున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు ఓ మాంచి స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తున్నాడట. కానీ ఇది డిజిటల్ ప్లాట్ ఫాంకు మాత్రమే సరిపోయే కాన్సెప్ట్. వెబ్ సిరీస్ రూపంలో దీన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. కాకపోతే ఈయన డైరెక్షన్ వహించడు. తన అసోసియేట్స్ లో ఎవరో ఒకరి చేతులకు వెబ్ సిరీస్ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది.

భారీ బడ్జెట్ తో.. పేరు మోసిన నటులతోనే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట మారుతి. వీరితో పాటు ఇప్పటివరకూ డిజిటల్ ప్లాట్ ఫాంపై మెరవని తారలను అతిథి పాత్రల్లో చూపించేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,