Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jan-2016 14:12:59
facebook Twitter Googleplus
Photo

పొగడ్తలు - ప్రశంసలు అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా నటుల విషయానికొస్తే.. ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. తమను పొగిడేవారిని దగ్గరకు తీయడం విమర్శించేవారిని దూరం పెట్టడం సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణమైన విషయం. అయితే.. అరుంధతి అనుష్క మాత్రం తాను ఇందుకు రివర్స్ అంటోంది.

ఎవరైనా తనను విమర్శిస్తుంటే శ్రద్ధగా వింటుందిట అనుష్క. అదే పొగిడే వాళ్లతో అయితే మాత్రం బాగా ఇబ్బంది పడుతుందిట. ఎలా స్పందించాలో అర్ధం కాదని అందుకే ఇలాంటి వాళ్లకు దూరంగా ఉంటానని స్వీటీ అంటోంది. 'కొంతమంది కొత్త కొత్త పోలికలు తెస్తూ ఉంటారు. నువ్వు ఆ హీరోయిన్ లా ఉన్నావు.. నీ నవ్వు ఆ యాక్ట్రెస్ లా ఉంటుంది. నిన్ను చూస్తుంటే కరీనా కపూర్ లా అనిపిస్తుంది. నీ యాక్టింగ్ చూస్తుంటే ఇంకోటేదో గుర్తొస్తుంది ఇలా ఏవేవో చెబుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇలా పొగిడినప్పుడు కొంచెం గర్వంగానే అనిపిస్తుంది కానీ అంతకంటే ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది' అని చెప్పింది స్వీటీ.

విమర్శల విషయంలో అయినా - పొగడ్తల విషయంలో అయినా ఏవి ఎంతవరకూ తీసుకోవాలో ఈ భామకు బాగా తెలుసట. అందుకే దేన్నీ సీరియస్ గా తీసుకోనని అంటోంది. పొగడ్తలతో పనిలేదని చెబుతూనే.. పొగిడితే గర్వంగా అనిపిస్తుందని చెప్పడం కొంచెం వెరైటీగా ఉంది కదూ

,