Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 15:43:54
facebook Twitter Googleplus
Photo

భలే భలే మగాడివోయ్ సినిమా ఫలితం చూసి.. అంతకుముందు కాదు పొమ్మన్న విక్టరీ వెంకటేష్ పిలిచి మరీ అవకాశమిచ్చాడు దాసరి మారుతికి. దీంతో మారుతి దర్శకుడిగా తర్వాతి స్థాయికి ఎదిగిపోయినట్లే అనుకున్నారు. ?బాబు బంగారం? అంచనాల్ని అందుకుని ఉంటే.. కచ్చితంగా అతను పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిపోయేవాడు. ఐతే ?బాబు బంగారం? టీజర్.. ట్రైలర్లతో ఎంతో నమ్మకం కలిగించిన మారుతి.. సినిమాతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కొన్ని అంశాలు కలిసి రావడం వల్ల సినిమాకు కలెక్షన్లైతే ఓ మోస్తరుగా వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా చూస్తే మాత్రం ?బాబు బంగారం? ఫెయిల్యూర్ అనడంలో ఎవరికీ సందేహాల్లేవు.

?బాబు బంగారం? తర్వాత బన్నీ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని ఆశించాడు మారుతి. కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీలే అఖిల్ అయినా లైన్లో ఉన్నాడు అనుకుంటే.. ఏదీ ఒక పట్టాన తేల్చని అఖిల్ కూడా ఓకే అన్నట్లే అని హ్యాండిచ్చేశాడు. అతను విక్రమ్ కుమార్ తోనే తన తర్వాతి సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. దీంతో మారుతి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతికి మరే పెద్ద హీరో కూడా అవకాశమిచ్చేలా లేడు. మళ్లీ నాని టైపు మీడియం రేంజి హీరోల్నే చూసుకోవాలి. ఐతే నాని కూడా ఫుల్ బిజీనే. ?కొత్త జంట? తర్వాత తనేంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో ఎలా పడ్డాడో.. ఇప్పుడు కూడా మారుతి పొజిషన్ అలాంటిదే. మరి మారుతి ఎవరితో సినిమా చేస్తాడో.. ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

,  ,  ,  ,  ,