Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 10:59:35
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోస్ లో సాయిధరం తేజ్ కు బాగా స్పీడ్ ఎక్కువ. చకచకా సినిమాలు ఫినిష్ చేసేస్తుంటాడు. ఏడాది రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేసే స్పీడ్ చూపించే ఏకైక మెగా హీరో తేజు. ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ అనే టైటిల్ పై సాయి ధరం తేజ్ ఓ సినిమా చేస్తుండగా.. ఇప్పుడీ మూవీకి టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేసినట్లు యూనిట్ తెలిపింది.

జూన్ నెలలో మరో షెడ్యూల్ ప్లాన్ చేయగా.. ఇందులో రెండు ఫైట్స్ తో పాటు.. కొన్ని పాటలను పిక్చరైజ్ చేస్తారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జూలైలో పూర్తి చేసి. ఆగస్ట్ లో జవాన్ ను థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేసుకున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం ద్వారా తన సన్నిహితుడు కృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నట్లు.. జవాన్ కు సమర్పకుడు అయిన దిల్ రాజు అంటున్నారు. దర్శకుడు బీవీఎస్ రవితో కూడా తమ బ్యానర్ కు రిలేషన్ ఉందన్న ఆయన.. తేజుతో అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పడం విశేషం.

ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టెయినర్ అంటున్న దర్శకుడు బీవీఎస్ రవి.. ప్రతీ ఇంటిలోని తమ హీరోలాంటి ఒకడు ఉండాలని.. అందుకే జవాన్ టైటిల్ కి ఇంటికొక్కడు అనే ట్యాగ్ లైన్ తగిలించినట్లు చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,  ,