Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2015 12:11:21
facebook Twitter Googleplus
Photo

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీకి 'ఎక్స్ ప్రెస్' పేరు సెంటిమెంటుగా మారినట్టుంది. ఎందుకంటే, తన తదుపరి చిత్రానికి కూడా ఆ పేరు కలిసేలా టైటిల్ నిర్ణయించాడు. శర్వానంద్ హీరోగా గాంధీ తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'ఎక్స్ ప్రెస్ రాజా' అనే టైటిల్ ని నిర్ణయించినట్టు తాజా సమాచారం. కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముంబయ్ మోడల్ హిమామి సిసోడియా ఇందులో కథానాయికగా ఎంపికైంది. వచ్చే నెలలో ఇది సెట్స్ కి వెళుతుంది.

,  ,  ,  ,