Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Aug-2016 16:15:11
facebook Twitter Googleplus
Photo

రవితేజకు పోలీస్ పాత్రలకు మాంచి అనుబంధం ఉంటుంది. ఈ మాస్ రాజా పోలీస్ గెటప్ వేసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ అయిపోవడం ఒక పాయింట్ అయితే.. రవితేజతో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపే కొత్త డైరెక్టర్లు.. ఈ హీరోను పోలీస్ గానే చూస్తున్నారు.. చూపిస్తున్నారు.

రీసెంట్ గా విక్రమ్- దీపక్ అనే జంట దర్శకులు రవితేజతో సినిమా చేయనున్నారు. 9 నెలల నుంచి ఖాళీగా ఉన్న మాస్ మహరాజ్.. త్వరలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. ఇదో స్టైలిష్ కాప్ డ్రామా అని ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి ముందు బాబీ కూడా రవితేజను పోలీస్ గానే పోలీస్ గానే చూపించాడు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకుడిగా మొదటి సినిమా పవర్. ఇందులో మాస్ పోలీస్ గా రవితేజ అదరహో అనిపించేశాడు. వీళ్లిద్దరికీ ముందు హరీష్ శంకర్ కూడా ఇలాగే చేశాడు.

హరీష్ శంకర్ మొదటి సినిమా షాక్. ఇందులో హీరో పోలీస్ కాదు కానీ.. విలన్లను ఆ రోల్ లో చూపించి.. ఓ పోలీస్ స్టోరీ లాంటిదే నడిపిస్తాడు. హరీష్ శంకర్ నెక్ట్స్ మూవీ మిరపకాయ్ లో.. రవితేజనే పోలీస్. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు కూడా విక్రమార్కుడు అంటూ రవితేజను పోలీస్ గానే చూపించాడు. మాస్ మహరాజ్ మొదట డ్యుయల్ రోల్ చేసిన సినిమా కూడా ఇదే.

వీటన్నిటి కంటే ముందు రవితేజ లీడ్ రోల్ లో నటించిన మొదటి సినిమా సింధూరం కూడా.. పోలీసులకు-అన్నలకు మధ్య జరిగే కథే.

,  ,  ,  ,