Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 12:06:36
facebook Twitter Googleplus
Photo

మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూతురు కొణిదెల నీహారిక హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్న మూవీ ఒక మనసు. యంగ్ హీరో నాగశౌర్యకు జంటగా ఈ మూవీలో నటిస్తోంది నీహారిక. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి.. త్వరలో ఆడియో వేడుక జరిపేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.

రామరాజు దర్శకత్వంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'ఒక మనసు' మూవీ ఆడియోను మే నెలలో విడుదల చేయబోతున్నారు. ఈ ఫంక్షన్ కు నీహారిక సోదరుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే.. తమ కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరోయిన్ కావడంతో.. నీహారిక లాంఛింగ్ మూవీ ఆడియో ఫంక్షన్ కు మెగా స్టార్ చిరంజీవి కూడా హాజరు కానున్నారనేది లేటెస్ట్ న్యూస్.

తండ్రి నాగేంద్ర బాబు ఎలాగూ ఈ ఫంక్షన్ కి అటెండ్ అవుతాడు. బ్రదర్ వరుణ్ తేజ్ తో పాటు.. మరో మెగా హీరో సాయిధరం తేజ్ కూడా.. నీహారిక మూవీ ఫంక్షన్ కి వచ్చేందుకు సై అన్నాడు. చూస్తుంటే.. ఒకరు తప్ప మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒక మనసు ఆడియో వేదికపై మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఒకరు ఎవరో మీక్కూడా తెలుసుగా!

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,