Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 13:11:24
facebook Twitter Googleplus
Photo

చాందినీ చౌదరి.. సినీ అభిమానులకు ఈ భామ ఇంకా పూర్తిగా తెలియలేదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం ఈమెపై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ చూసే జనాలకైతే చాందినీ చౌదరి బాగానే తెలుసు. కేటుగాడు మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసినా.. అదేమీ పెద్దగా కలిసి రాలేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించినా పెద్దగా ఉపయోగపడలేదు. బ్రహ్మోత్సవం మూవీలో సంగీత్ సాంగ్ ఉంటుంది కదా.. ఆ పాటలో పెళ్లికూతురుగా కనిపించే చిన్నది చాందిని చౌదరినే. ఈ సినిమా ద్వారా తన లైఫ్ టర్నింగ్ ఇచ్చుకుంటుందని ఎక్స్ పెక్ట్ చేసింది కానీ... బ్రహ్మోత్సవం ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లిపోయింది. ఇప్పుడీ భామ కుందనపు బొమ్మ మూవీతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ కుందనపు బొమ్మపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ కావడంతో.. హీరోయిన్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ కోసం చాందినీ చౌదరిని ఎంపిక చేసినట్లు దర్శకుడు ఇప్పటికే చెప్పాడు. పాత్ర ప్రకారం తెలుగు మాట్లాడాల్సి ఉండడంతో తెలుగమ్మాయినే తీసుకునేందుకు చాలా కాలం వెతికి.. చివరకు చాందినీ చౌదరిని సెలక్ట్ చేశామన్నాడు. కుందనపు బొమ్మలో చాందిని చేస్తున్న రోల్ పేరు సుచి కాగా.. ఆమె పెర్ఫామెన్స్ ను యూనిట్ ఇప్పటికే ఆకాశానికి ఎత్తేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఈ బొమ్మ రానుండగా.. ఈ సినిమాతో తన ఫిలిం కెరీర్ గాడిలో పడుతుందని చాందినీ చౌదరి ఆశలు పెట్టుకుంది.

,  ,  ,  ,  ,