Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Dec-2017 10:49:35
facebook Twitter Googleplus
Photo

దాదాపు అన్ని సినిమాల్లోనూ మిడిల్ క్లాస్ అబ్బాయిగానే కనిపించాడు. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో నేను లోకల్ వంటి సినిమాతో అదే మిడిల్ క్లాస్ కుర్రాడిగా పవర్ ఫుల్ హిట్టు కొట్టాడు. అయితే ఇప్పుడు మరోసారి అదే తరహా కథాంశంతో మళ్ళీ వచ్చాడు ఈ న్యాచురల్ స్టార్. పదండి.. ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణుశ్రీరామ్ డైరక్షన్లో రూపొందిన ఎంసిఏ సంగతేంటో చూద్దాం.

తన అన్నయ్య భార్య (భూమిక) అంటే నాని కు అస్సలు పడదు. పైగా వదినగారు అని కూడా పిలవడు. కేవలం అన్నయ్య భార్య కాబట్టి అన్నవాళ్ళావిడ అని మాత్రమే పిలుస్తాడు. అటువంటి వదిన గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావడంతో.. ఆమెతో కలసి వరంగల్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడకు వెళ్ళాక మనోడు రాణి ప్రేమలో పడతాడు. అక్కడే వదినకు కూడా ఒక ఇబ్బంది ఎదురవుతుంది. ఆ విలన్ తో కలసి మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన నాని ఏం చేశాడనేదే కథ. సినిమా విజువల్స్ పరంగా దిల్ రాజు బ్రాండ్ గట్టిగానే కనిపిస్తోంది కాని.. కంటెంట్ పరంగా మాత్రం పెద్దగా కొత్తగా ఏమీ అనిపించట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీలో అసలు ఒక వ్యక్తంటే పడకపోయినా.. అక్కడ వరకు వచ్చేసరికి ఆ వ్యక్తి కోసం ఫ్యామిలీలోని హీరో అడ్డంగా నుంచుని ఫైట్ చేయడం.. కొత్త లైన్ మాత్రం కాదు. రీసెంటుగా రేసుగుర్రం ఇదే లైన్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇకపోతే నానిగా నాని.. వదినగా భూమిక.. రాణిగా సాయి పల్లవి.. ఇలా అందరూ బాగున్నారు. అలాగే కామెడీ డైలాగులు కూడా బాగానే రాసుకున్నట్లున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ లా కనిపిస్తోంది. సాయి పల్లవితో కెమిస్ర్టీ.. అలాగే కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్ అయితే మాత్రం.. సినిమా ఆడుతుంది. కాని ఎక్కడన్నా ఆ పాళ్ళలో తేడా వస్తే మాత్రం కథ రొటీన్ అనే ఫీలింగ్ వస్తుంది.

,  ,  ,  ,  ,