Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2015 16:55:43
facebook Twitter Googleplus
Photo

అనుష్క తనకు మంచి స్నేహితురాలని.. ఐతే పదేళ్ల పరిచయంలో ఆమె వేరే సినిమా దేని గురించి కూడా తనతో మాట్లాడలేదని కానీ ?సైజ్ జీరో? విషయంలో మాత్రం చాలా ఎగ్జైట్ అయిందని చెప్పాడు రాజమౌళి. ??అనుష్క నాకు క్లోజ్ ఫ్రెండ్. ఐతే మేమెప్పుడూ వేరే సినిమాల గురించి మాట్లాడుకోం. తను చేస్తున్న సినిమాల గురించి చెప్పదు. కానీ సైజ్ జీరో విషయంలో మాత్రం ఆమెలో చాలా ఎగ్జైట్మెంట్ చూశాను. పది నిమిషాల పాటు ఆపకుండా ఆ సినిమా గురించి మాట్లాడింది. ఐతే ఆమె ఏం చెప్పిందో ఒక్క ముక్కా అర్థం కాలేదు. కానీ ఆమె ఎగ్జైట్ మెంట్ మాత్రం బాగా నచ్చింది. దాన్ని బట్టే చెప్పేయొచ్చు.. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని?? అన్నాడు రాజమౌళి.

?సైజ్ జీరో? లాంటి ప్రయోగాత్మక సందేశాత్మక చిత్రాన్ని ఇంత ఖర్చు పెట్టి హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించడం గొప్ప విషయమని జక్కన్న అన్నాడు. ??మామూలుగా కొంచెం సందేశం ఉన్న సినిమాల్ని చాలా తక్కువ ఖర్చుతో లాగించేయాలని చూస్తారు. బీద సినిమాలా తీస్తారు. కానీ సైజ్ జీరో సినిమా విషయంలో అలా జరగలేదు. హై స్టాండర్డ్స్ తో సినిమా తీశారు. పెద్ద పెద్ద నటీనటుల్ని టెక్నీషియన్స్ ని పెట్టుకున్నారు. సినిమాను జనాలకు చేరువ చేయాలని చూశారు. సైజ్ జీరో కచ్చితంగా పెద్ద హిట్టయ్యే సినిమా. అందుకే ముందే అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. ఓ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎగ్జైట్ మెంట్ కలిగించేలా ట్రైలర్ ఉండాలి. అలాంటి ఆసక్తి రేపింది ?సైజ్ జీరో? ట్రైలర్?? అని రాజమౌళి చెప్పాడు.

,  ,  ,  ,