Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 13:12:08
facebook Twitter Googleplus
Photo

త్వరలో విడుదల కానున్న ?మీలో ఎవరు కోటీశ్వరుడు? నిర్మాత కె.కె.రాధామోహన్ స్పీడ్ పెంచాడు. ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు... మూడు చిత్రాలను నిర్మించడానికి రెడీ అయ్యాడు. గతంలో ఏమైంది ఈవేళ... బెంగాల్ టైగర్ చిత్రాలను నిర్మించిన ఆయన త్వరలో నాగశౌర్య - నితిన్ - గోపీచంద్ లతో వరుబెట్టి సినిమాలు నిర్మించడానికి తయారయ్యాడంట. ఇందులో ముందుగా నాగశౌర్యతో జనవరిలోనూ.. ఆ తరువాత మిగతా ఇద్దరితో సినిమాలు చేయడానకి ప్లాన్ చేస్తున్నాడు.

త్వరలో నవీన్ చంద్ర... థర్టీ ఇయర్స్ పృథ్వీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' విడుదల కానుంది. ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకత్వం. ఈ చిత్రం నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇదే నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంటున్నాడీ నిర్మాత.

ప్రస్తుతం గోపీచంద్ ఆక్సిజన్ మూవీతోనూ... సంపత్ నంది.. బి.గోపాల్ చిత్రాలతో బిజీగా వున్నాడు. ఈ చిత్రాలన్నీ రిలీజ్ కావాలంటే మరో అర్నెళ్లయినా పట్టొచ్చు. ఈ చిత్రాలన్నీ కంప్లీట్ అయిన తరువాతే.. కె.కె.రాధామోహన్ నిర్మాణంలో నటించొచ్చు గోపీ. నాగశౌర్యతో జనవరిలో కొత్త సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నాడు. ఇలా వరుసబెట్టి సినిమాలు తీస్తూ.. టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ నిర్మాతగా వుండాలనుకుంటున్నాడేమో కె.కె.రాధామోహన్. ఆల్ ది బెస్ట్!

,  ,  ,  ,  ,