Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2017 11:54:24
facebook Twitter Googleplus
Photo

షో విజేత శివ బాలాజీ. కానీ తెర మీద సడెన్ గా పవన్ పేరు అతడితో పాటు వినిపిస్తోంది. విచిత్రంగా ఉంది కదా! అవును. బిగ్ బాస్ తో పవన్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లుగా సోషల్ మీడియాలో - ఛానళ్లలో హోరెత్తిపోతోంది. ఈ షోలో నటుడు శివబాలాజీ విజేతగా నిలవడం వెనుక పవన్ ఉన్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాటమరాయుడు సినిమాలో పవన్ తమ్ముడిగా నటించిన శివబాలాజీతో పవన్ కు ఆత్మీయ సంబంధం ఉంది. దీంతో పవన్ అభిమానులు శివబాలాజీకి అనుకూలంగా భారీ సంఖ్యలో ఓట్లేయడంతో ఆయన విజేతగా నిలిచారన్నది టాక్.

పవన్ ఇమేజ్ ను వాడుకుని కొన్ని సినిమాలు కలెక్షన్లు కొట్టిన మాట నిజమే. సప్తగిరి ఎక్స్ ప్రెస్ దానికి తాజా ఉదాహరణ. పవన్ దాని ఆడియో ఫంక్షనుకు కూడా వచ్చాడు. దాని వెనుక ఓ కథ ఉందనుకోండి. అయితే తాజాగా దానిని బిగ్ బాస్ షోకు లింకు పెట్టారు. తానేమీ ఇన్వాల్వ్ కాకుండానే ఒక షో విజేతను పరోక్షంగా నిర్ణయించిన శక్తిగా పవన్ పేరు మోగుతోంది.

మరో వైపు... బిగ్ బాస్ రియల్ ఫ్యాన్స్ మాత్రం దీనిని సహించడం లేదు. ఆ రియాల్టీ షోలో శివ బాలాజీ ప్రతి గేమ్ బాగా ఆడాడు. ఆదర్శ్ కంటే శివ బాలాజా పాపులర్. ఆదర్శ్ కి అన్ని ఓట్లు వచ్చినపుడు కేవలం ఎనిమిది లక్షల ఓట్లు శివకు ఎక్కువ రావడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా పవన్ ఇంపాక్ట్ అన్న సమస్యే లేదంటున్నారు. ఈ విజయాన్ని పవన్ అక్కౌంట్లో వేయడానికి ఫ్యాన్స్ తెలివిగా ట్రై చేస్తున్నారని అంటున్నారు.

,  ,  ,  ,  ,