Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2015 17:22:44
facebook Twitter Googleplus
Photo

మలయాళ చిత్రం 'దృశ్యం' .. తమిళ తెరపైకి 'పాపనాశం' పేరుతో వచ్చింది. మలయాళ .. తెలుగు భాషలలోను ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అదే విధంగా తమిళ్లోను ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ భార్యగా .. మధ్యతరగతి గృహిణిగా గౌతమి నటించింది. భర్త మనసెరిగి నడచుకునే ఈ పాత్రలో ఆమె అద్భుతంగా నటించిందనీ .. పాత్రకి పూర్తి న్యాయం చేసిందని నటి మీనా అభినందించింది.

సాధారణంగా అయితే ఈ ప్రశంసకి అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా మాతృక మలయాళంలోను .. దాని రీమేక్ వచ్చిన తెలుగు 'దృశ్యం'లోను కథానాయకుడి భార్యగా మీనాయే నటించింది. అలాంటి మీనా .. గౌతమి ఈ పాత్రలో ఒదిగిపోయిందని ప్రశంసించడం గొప్ప విషయమే కదా. అందుకే మీనా కాంప్లిమెంట్ ప్రత్యేకతను సంతరించుకుని అంతా చెప్పుకునేలా చేస్తోంది.

,  ,