Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2017 11:35:50
facebook Twitter Googleplus
Photo

ఒకే ఫ్యామిలీకి చెందిన సినీ హీరోలు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో మెగా బ్రాండ్ నేమ్ తో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారో తెలిసిందే. అయితే మెగా బ్రాండ్ నేమ్ తో వచ్చినా కూడా కొన్ని సినిమాలతోనే ఎవరికీ వారు వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క నాగబాబు తప్పితే అందరూ మెగా సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు. నాగబాబు చేయకున్నా ఆయన కుమారుడు అయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మెగా హీరోలు వారి సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు.

ఒక్కొక్కరు ఒక్కో విధమైన సినిమాలను చేస్తున్నారులే. ఓ విధంగా చెప్పాలంటే కమర్షియల్ చిత్రాలే కాకుండా కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరందరిలో ముందుగా మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొంత కాలంగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న ఈ సుప్రీమ్ హీరో జవాన్ గా రాబోతున్నాడు. అలాగే వివి.వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. ఇక మరో అల్లుడు అల్లు అర్జున్ అదే ఫార్మాట్ లో నా పేరు సూర్యా అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా మరో సరికొత్త చిత్రంతో రాబోతున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా దర్శకుడు విఐ.ఆనంద్ తెరకెక్కించబోయే సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.

ఇక మెగా తనయుడు రామ్ చరణ్ అయితే తన సినీ కెరీర్ లో ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే సినిమాను చేస్తున్నాడు. మరో తనయుడు వరుణ్ తేజ్ కూడా తన చిన్నాన్న తొలి ప్రేమ టైటిల్ తీసుకొని సినిమా సెట్స్ పై ఉండగానే అందరిని ఆకర్షిస్తున్నాడు. ఫైనల్ గా మెగా బ్రదర్స్ కూడా వారి సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' కోసం చాలా కష్టపడుతున్నారు. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అజ్ఞాతవాసి అంటూ.. అందరిని ఊరిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమాతో పవన్ నెక్స్ట్ ఇయర్ ని మెగా బొనాంజా తో మొదలు పెడుతున్నాడు.

,  ,  ,  ,  ,  ,