Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2015 10:32:35
facebook Twitter Googleplus
Photo

'ఇద్దరమ్మాయిలతో', 'పైసా', 'ఎర్రబస్సు' వంటి సినిమాలలో నటించి, తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళ ముద్దుగుమ్మ కేథరిన్ త్రెసా, త్వరలో విడుదల కానున్న 'రుద్రమదేవి' సినిమాలో కూడా మంచి కేరెక్టర్ వేసింది. అయితే, కేవలం టాలీవుడ్ మీదే ఆధారపడకుండా ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళుతోంది. ఆమధ్య తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరో తమిళ సినిమాలో నటించే ఛాన్స్ ఈ చిన్నదానికి వచ్చింది. విష్ణు విశాల్ హీరోగా నటించే 'వీర ధీర శూరన్' చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. మొదట్లో ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆయన స్థానంలో శంకర్ దయాళ్ దర్శకత్వ బాధ్యతలు చేబట్టాడు.

,  ,  ,  ,