Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 14:19:33
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీలో అరడజను మందికి పైగా హీరోలు యాక్టివ్ గా ఉంటున్నారు. వీళ్లకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తోడయ్యాడు. ఇంతమంది హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేసినా.. ఏడాదికి ఏడు సినిమాలు రిలీజవుతాయి. వీరిలో చాలామంది ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటుండటంతో సంవత్సరమంతా మెగా హీరోల సందడి కనిపిస్తోంది. ఐతే ఈ మధ్య మెగా హీరోల హంగామా కొంచెం తగ్గింది. జులైలో ‘ఫిదా’ రిలీజయ్యాక మెగా హీరోల సినిమాలేవీ రిలీజవ్వలేదు. ఐతే నాలుగైదు నెలల విరామం తర్వాత మెగా హీరోల హంగామా మళ్లీ మొదలు కాబోతోంది. వరుసగా ఐదు నెలల్లో ఐదు సినిమాలతో సందడి చేయబోతున్నారు ఆ ఫ్యామిలీ హీరోలు.

ముందుగా డిసెంబరు 1న సాయిధరమ్ తేజ్ జవాన్ సినిమాతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాతి నెలలో సంక్రాంతి సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అజ్నాతవాసి రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజులకు వరుణ్ తేజ్ మూవీ తొలి ప్రేమ రిలీజవుతుంది. ఇక మార్చి నెలాఖరులో రామ్ చరణ్ రంగస్థలం తో పలకరించబోతున్నాడు. ఇంకో నెల రోజులకు అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య రాబోతోంది. ఇలా ఐదు నెలల్లో ఐదు మెగా సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈ ఐదు సినిమాలత పాటు ఇంకో రెండు మెగా హీరోల సినిమాలు రిలీజయ్యేందుకు కూడా ఆస్కారముంది.

,  ,  ,  ,