Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jan-2015 11:00:37
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో ఈ తరహా సినిమాలకు శిఖర స్థాయి అనదగ్గ ఓ అతిపెద్ద మల్టీ స్టారర్ ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్, రామ్ చరణ్... ఈ బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్లో ఇది రూపొందనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి టాలీవుడ్ మెగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడనీ, ఈ మెగా హీరోలిద్దర్నీ కలిపింది కూడా ఈయనేననీ సమాచారం. ప్రముఖ నిర్మాతలు భగవాన్, పుల్లారావులు దీనిని సంయుక్తంగా నిర్మిస్తారట. ఇదే గనుక కార్యరూపం దాలిస్తే, మెగా అభిమానులకు అంతకు మించిన ఆనందం మరే ముంటుంది?

,  ,  ,  ,  ,