Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 12:12:36
facebook Twitter Googleplus
Photo

కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు తెరకు పరిచయమైంది మెహరీన్. తొలి చిత్రమే అయినా మంచి నటనతో ఆకట్టుకుంటుంది. అచ్చమైన తెలుగమ్మాయిలాగా తెరపై కనిపించింది. దీంతో తెలుగు ఇండస్ట్రీ ఆమెపై ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేసింది. దీంతో మెహరీన్ కి ఆఫర్లమీద ఆఫర్లు వెళుతున్నాయట. కానీ ఆమే ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్న మెహరీన్ తాజాగా మరో మెగా హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ హీరో ఎవరో కాదు... అల్లు శిరీష్.

ఎంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు శిరీష్. ఇప్పటికే ఆ సినిమా ప్రారంభమైంది కూడా. అందులో హీరోయిన్ గా మెహరీన్ ని సెలెక్ట్ చేసేశారు. ఓ ప్రేమకథతో తెరకెక్కుతున్న ఆ సినిమాకి మెహరీన్ అయితేనే బాగుంటుందని చిత్రబృందం ఫిక్సయ్యిందట. ఆమె కూడా ఒప్పుకోవడంతో సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లు శిరీష్. ఆ సినిమాపై పూర్తి నమ్మకంగా వున్న ఆయన వరుసగా సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నాడు.

,  ,  ,  ,  ,